Jaipal Reddy: ఎమ్మెల్యేలు సంతలో పశువుల్లాగా అమ్ముడు పోయారు: జైపాల్‌రెడ్డి

  • నీచ రాజకీయాలకు పరాకాష్టగా కేసీఆర్ మారారు
  • సీఎల్పీని విలీనం చేసే అధికారం స్పీకర్‌కు లేదు
  • విలీనంపై హైకోర్టును ఆశ్రయిస్తాం

సీఎం కేసీఆర్‌కు స్పీకర్ చెంచాలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్‌లో సీఎల్పీని విలీనం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారని మండి పడ్డారు.

నీచ రాజకీయాలకు పరాకాష్టగా కేసీఆర్ మారిపోయారని జైపాల్‌రెడ్డి విమర్శించారు. సీఎల్పీని విలీనం చేసే అధికారం స్పీకర్‌కు లేదని, ఆ అధికారం ఈసీకి మాత్రమే ఉందని అన్నారు. కాంగ్రెస్‌ను చీల్చడానికి స్పీకర్ ఎవరని నిలదీశారు. విలీనంపై హైకోర్టును ఆశ్రయిస్తామని జైపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

Jaipal Reddy
KCR
Congress
TRS
Speaker
  • Loading...

More Telugu News