School: పాఠశాల ఆవరణలో అగ్నిప్రమాదం.. తల్లి సహా ఇద్దరు పిల్లల మృతి!

  • యూనిఫాం గోడౌన్‌లో అంటుకున్న మంటలు
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు
  • పరిస్థితిని అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది

ఓ పాఠశాలలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం ముగ్గుర్ని బలిగొంది. హరియాణాలోని ఓ కాన్వెంట్ స్కూలులో ఈ ఘోరం జరిగింది. రాష్ట్రంలోని ఫరీదాబాద్ జిల్లా దబువాలోని 'ఎన్ఎన్‌డీ' స్కూలులో యూనిఫాంలు నిల్వ చేసే గోడౌన్‌లో మంటలు చెలరేగడంతో, కాసేపటికే అవి స్కూలు మొత్తం అలముకున్నాయి.

దీంతో అదే స్కూలు ఆవరణలో నివసించే ఉపాధ్యాయురాలు, ఆమె ఇద్దరు పిల్లలు ఆ మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. వీరిని కాపాడేందుకు మరో ఇద్దరు ప్రయత్నించగా వారు తీవ్ర గాయాలపాలయ్యారని, వెంటనే వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపు చేశారు.

School
Fire Accident
Teacher
Haryana
NND Convent
Uniform
  • Loading...

More Telugu News