Uttar Pradesh: ప్రభుత్వ అధికారులు మీకు మర్యాద ఇవ్వకుంటే షూతో కొట్టండి!: బీజేపీ ఎమ్మెల్యే కుష్వాహా

  • బీజేపీ కార్యకర్తలకు సూచించిన నేత
  • ప్రభుత్వాధికారులపై మండిపాటు
  • 2017లో ఎమ్మెల్యేగా ఎన్నికైన కుష్వాహా

యూపీ బీజేపీ ఎమ్మెల్యే రామ్ రతన్ కుష్వాహా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా బీజేపీ కార్యకర్తలకు మర్యాద ఇవ్వకపోతే షూతో కొట్టాలని వ్యాఖ్యానించారు. ఓపికకు కూడా ఓ హద్దు ఉంటుందని స్పష్టం చేశారు. లక్నోలో బీజేపీ కార్యకర్తలతో జరిగిన ఓ సమావేశంలో కుష్వాహా మాట్లాడారు. కొందరు అధికారులు ఇంకా సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ భావజాలంతో పనిచేస్తున్నారని ఆరోపించారు.

వాళ్లంతా ఎన్నికల సమయంలో ఎస్పీ, బీఎస్పీలో చేరాలని బీజేపీ కార్యకర్తలపై ఒత్తిడి తీసుకొచ్చారని మండిపడ్డారు. అలాంటి అధికారులంతా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో లలిత్ పూర్ నియోజకవర్గం నుంచి రామ్ రతన్ కుష్వాహా ఘనవిజయం సాధించారు.

Uttar Pradesh
BJP
ram ratan kushwaha
mla
hit withe shoe
  • Loading...

More Telugu News