Marriage: మంత్రాల హడావుడిలో పురోహితుడు.... వరుడి మెళ్లో తాళి కట్టబోయిన పెళ్లికూతురు!

  • వైరల్ గా మారిన వీడియో
  • పెళ్లిమంటపంలో నవ్వులే నవ్వులు!
  • చివరికి తానే తాళికట్టిన వరుడు

కుడి ఎడమైతే పొరబాటు లేదంటారు! కానీ, పెళ్లి తంతులో మాత్రం ఇది కుదరదు. ఆచారం అంటే ఆచారమే. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లికూతురు మెడలో పెళ్లికొడుకే తాళి కట్టాలి. కానీ, ఇక్కడ ఓ పురోహితుడు మంత్రాల హడావుడిలో తాళి పెళ్లికూతురి చేతికివ్వగా, ఆమె వరుడి మెడలో కట్టబోవడం పెళ్లిమంటపంలో నవ్వులు విరబూయించింది. యూట్యూబ్ లో ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో విపరీతంగా సందడి చేస్తోంది.

వధూవరులు పైకి లేచి నిలబడి ఉండగా, మాంగల్యధారణ మంత్రాలు చదువుతున్న పురోహితుడు అయోమయంతో తాళిని పెళ్లికూతురు చేతికి అందించాడు. ఆమె ఆ తాళిని తన ఎదురుగా నిలుచున్న వరుడి మెడలో కట్టేందుకు సీరియస్ గా ప్రయత్నించగా, ఇంతలో వరుడు అప్రమత్తమై వారించడం వీడియోలో కనిపించింది. దాంతో ఈ లోకంలోకి వచ్చిన పురోహితుడు వధువు చేతినుంచి తాళిని తీసుకుని వరుడికి అందించాడు. వరుడు మూడుముళ్లు వేయడంతో కీలకమైన ఘట్టం ముగిసింది. ఇదంతా చూస్తున్న బంధుమిత్రులు, అతిథులు పడీపడీ నవ్వుకున్నారు.

Marriage
Video
Viral Videos
  • Error fetching data: Network response was not ok

More Telugu News