tapsi: హీరోయిన్ ను కావడంతో.. నాకు ఇల్లు అద్దెకివ్వడానికి ఎవరూ ఇష్టపడలేదు!: తాప్సి

  • నటన వృత్తిపై ప్రజలకు గౌరవం లేదు
  • మమ్మల్ని చూసేందుకు జనాలు వందల రూపాయలు ఖర్చు చేస్తారు
  • కానీ వారి సమాజంలో మేము నివసించేందుకు మాత్రం ఒప్పుకోరు

రంగుల ప్రపంచంలో ఓ వెలుగు వెలిగే తారలు... రియల్ లైఫ్ లో ఎలాంటి కష్టాలను అనుభవిస్తారో ఇది ఒక ఉదాహరణ. తనకు అద్దెకు ఇల్లు ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదని సినీ నటి తాప్సి ఆవేదన వ్యక్తం చేసింది. బాలీవుడ్ లో బిజీగా ఉన్న తాప్సి... ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ విషయాన్ని వెల్లడించింది.

హైదరాబాద్ నుంచి ముంబైకి షిఫ్ట్ అయిన తర్వాత అద్దె ఇంటిని వెతుక్కోవడానికి తాను పడిన కష్టాలను తాప్సి ఏకరువు పెట్టింది. నటన వృత్తిపై ప్రజలకు గౌరవం లేదని ఆమె తెలిపింది. మమ్మల్ని చూడ్డానికి వందల రూపాయలు ఖర్చు పెడతారని... నేరుగా చూడ్డానికి సినిమా ఈవెంట్లకు వస్తారని... కానీ, వారున్న సమాజంలో, వారి పక్కన తాము నివసించేందుకు మాత్రం ఒప్పుకోరని చెప్పింది.

తాను ఒంటరిగా ఉండే నటిని కావడంతో తనకు ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదని తెలిపింది. ఈ విషయం తనను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పింది. ఇప్పుడు తనకు కూడా ఓ ఇల్లు ఉందని... తన సోదరితో కలసి సంతోషంగా ఉంటున్నానని తెలిపింది. తన తల్లిదండ్రులు ఢిల్లీలోనే ఉంటున్నారని చెప్పింది.

tapsi
bollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News