bjp: తల్లి సమాధి వద్ద నివాళులర్పించిన కిషన్ రెడ్డి

  • తన స్వగ్రామం తిమ్మాపూర్ వెళ్లిన కిషన్ రెడ్డి
  • రామాలయంలో ప్రత్యేక పూజల నిర్వహణ
  • కేంద్ర మంత్రి అయిన తర్వాత తొలిసారి హైదరాబాద్ కు వచ్చిన కిషన్ రెడ్డి

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తన తల్లి ఆండాళమ్మకు నివాళులర్పించారు. రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలంలోని తిమ్మాపూర్ కు ఈ రోజు ఉయదం ఆయన వెళ్లారు. అక్కడి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, తన తల్లి సమాధిని కిషన్ రెడ్డి సందర్శించి నివాళులర్పించారు.

కాగా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా నిన్న ఆయన హైదరాబాద్ వచ్చారు. బేగం పేట ఎయిర్ పోర్టు నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీగా ఆయన వెళ్లారు. 2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని నిన్న కిషన్ రెడ్డి పిలుపు నిచ్చారు.

bjp
kishan reddy
minister
rangareddy
  • Loading...

More Telugu News