: ఏయూ ఇంజనీరింగ్ పేపర్ లీక్
ఆంధ్రా యూనివర్సిటీలో ప్రశ్నాపత్రాల లీకేజీల బాగోతం బయటపడింది. ఇంజనీరింగ్ ప్రశ్నాపత్రాలు ఒకరోజు ముందుగానే ఈ మెయిల్స్ ద్వారా విద్యార్థులకు చేరుతున్నట్టు అధికారులు కనుగొన్నారు. ఒక్కో ప్రశ్నాపత్రాన్ని పది వేలకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రశ్నా పత్రాలు ఏలూరులో లీకైనట్టు అధికారులు గుర్తించారు. దాంతో ఏయూ పరిధిలో జరుగుతున్న మేధ్స్ 2 పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అధికారులు సిద్దమౌతున్నారు.