Vikarabad District: కో ఆప్షన్‌ సభ్యుడిగా ఎన్నికైన కలెక్టర్‌ భర్త

  • ధర్మపురి మండల పరిషత్‌ సభ్యునిగా కైసర్‌ మహ్మద్‌
  • ఆయన భార్య అయేషా మస్రత్‌ ఖానం వికారాబాద్‌ కలెక్టర్‌
  • రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లోనే కైసర్‌

సాధారణ ఉద్యోగి కొడుకు/కూతురు కలెక్టర్‌ అయ్యారని సాధారణంగా చదువుకుంటాం. ఇక్కడ మాత్రం కలెక్టర్‌ భర్త మండల కో ఆప్షన్‌ సభ్యునిగా ఎన్నికయ్యారు. భార్య ఉన్నత స్థానంలో ఉన్నా గడచిన రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాలకే పరిమితమైన ఆయన చిన్నపదవి అయినా పెద్దగా భావిస్తారు. ధర్మపురి మండల పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యుడు కైసర్‌ అహ్మద్‌ రాజకీయ జీవితం ఇది.

ఈయన భార్య ఆయేషా మస్రత్‌ ప్రస్తుతం వికారాబాద్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. 1996లో పంచాయతీ వార్డు సభ్యునిగా రాజకీయ అరంగేట్రం చేసిన కైసర్‌ 2002లో తిమ్మాపూర్‌ సహకార సంఘం కో ఆప్షన్‌ సభ్యునిగా ఎన్నికయ్యారు. గతంలో రాజకీయాల్లో చాలా చురుకుగా ఉండే కైసర్‌ ఇటీవల కొన్నాళ్లుగా దూరంగా ఉంటూ వచ్చారు. తాజా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మళ్లీ ఆయనను తెరపైకి తెచ్చి కో ఆప్షన్‌ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Vikarabad District
dharmapuri district
collector husbend
co option member
  • Loading...

More Telugu News