Vijayawada: విజయవాడ చేరుకున్న గవర్నర్ తో సీఎం జగన్ భేటీ

  • గేట్ వే హోటల్ లో గవర్నర్ ని కలిసిన జగన్
  • మంత్రి వర్గం జాబితాను అందజేసిన జగన్
  • ఏపీలో రేపు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం 

ఏపీలో రేపు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కొద్ది సేపటి క్రితం విజయవాడకు చేరుకున్నారు. 25 మంది కొత్త మంత్రులతో రేపు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయవాడ చేరుకున్న గవర్నర్ ను సీఎం జగన్ కలుసుకున్నారు. స్థానిక గేట్ వే హోటల్ లో ఆయన్ని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న కొత్త మంత్రి వర్గం జాబితాను గవర్నర్ కు జగన్ అందజేశారు. ఈ జాబితాను గవర్నర్ ఆమోదించాక, కొత్త మంత్రులకు వాహనాలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ కానున్నాయి. కొత్త మంత్రులకు గన్ మెన్లను సిద్ధం చేసే ప్రయత్నంలో పోలీస్ శాఖ ఉన్నట్టు సమాచారం.

Vijayawada
YSRCP
cm
jagan
governer
  • Loading...

More Telugu News