Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో 19 మందిని బలిగొన్న ధూళి తుపాను
- పలు ప్రాంతాల్లో తుపాను బీభత్సం
- విలవిల్లాడిన ప్రజలు
- సహాయక చర్యలకు ఆదేశించిన యోగి ఆదిత్యనాథ్
ఇటీవల కాలంలో ఉత్తరాది రాష్ట్రాల్లో దుమ్ము, ధూళి తుపాన్లు తరచుగా సంభవిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ పై ధూళి తుపాను తన ప్రతాపం చూపించింది. మెయిన్ పురి, కస్ గంజ్, బదౌన్, పిలిభిత్, కనౌజ్, మొరాదాబాద్, సాంభల్, ఘజియాబాద్ ప్రాంతాల్లో తుపాను విరుచుకుపడిన ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 48 మంది గాయపడ్డారు. మరో 8 పశువులు కూడా మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే స్పందించి మంత్రులను, అధికారులను అప్రమత్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలకు ఉపక్రమించాలంటూ ఆదేశించారు.