Chittoor District: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన కారు.. ఐదుగురి దుర్మరణం

  • మృతులు గుంటూరు జిల్లా రుద్రవరం గ్రామస్థులుగా గుర్తింపు
  • తిరుపతి వెళ్తుండగా ఘటన
  • మృతుల్లో ఇద్దరు చిన్నారులు

చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోని పూతలపట్టు జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామానికి చెందిన బాధితులు కారులో తిరుపతి బయలుదేరారు. దురవరాజుపల్లి వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది.

ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. కారులోని ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో రుద్రవరానికి చెందిన విజయ భారతి(38), ప్రసన్న(14), చెన్నకేశవరెడ్డి(12), డ్రైవర్‌ ప్రేమ్‌రాజు (35), అంకయ్య(40) ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Chittoor District
Renigunta
Road Accident
Guntur District
  • Loading...

More Telugu News