Chandrababu: అనుకూలించని వాతావరణం.. చంద్రబాబు ప్రయాణిస్తున్న విమానం దారి మళ్లింపు

  • లోకేశ్‌తో కలిసి హైదరాబాద్ బయలుదేరిన చంద్రబాబు
  • ప్రతికూల వాతావరణంతో విమానం బెంగళూరుకు మళ్లింపు
  • అర్ధరాత్రి 1:30 గంటలకు హైదరాబాద్ చేరుకున్న మాజీ సీఎం

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న విమానాన్ని గురువారం సాయంత్రం అత్యవసరంగా దారి మళ్లించారు. నిన్న సాయంత్రం 7:20 గంటలకు కుమారుడు లోకేశ్‌తో కలిసి ఎయిరిండియా విమానంలో చంద్రబాబు హైదరాబాద్ బయలుదేరారు. అయితే, వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుని ప్రతికూలంగా మారడంతో విమానాన్ని అత్యవసరంగా బెంగళూరుకు మళ్లించారు.

రాత్రి 9:20 గంటలకు విమానం బెంగళూరు చేరుకుంది. వాతావరణం అనుకూలించడంతో తిరిగి రాత్రి 10:30 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరిన విమానం అర్ధరాత్రి దాటాక హైదరాబాద్ చేరుకుంది. నిర్ణీత సమయానికి ఏడు గంటలు ఆలస్యంగా అర్ధరాత్రి 1:30 గంటలకు విమానం హైదరాబాద్‌లో ల్యాండ్ అయింది.

  • Loading...

More Telugu News