Ravi prakash: నేనేతప్పూ చేయలేదు.. అసలు టీవీ9 సృష్టికర్తనే నేను: రవిప్రకాశ్

  • మూడో రోజు విచారణలోనూ పొంతనలేని సమాధానాలే
  • దర్యాప్తును దారిమళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్న పోలీసులు
  • విడతల వారీగా ప్రశ్నించినా ఫలితం శూన్యం

ఫోర్జరీ, తప్పుడు పత్రాల సృష్టి, టీవీ9 లోగో విక్రయం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్ మూడో రోజూ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు పొంతనలేని, ముక్తసరి సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. తనపై నమోదైనవన్నీ తప్పుడు ఆరోపణలేనని, నిజానికి టీవీ9 సృష్టికర్తనే తానని పోలీసులతో పలుమార్లు చెప్పినట్టు సమాచారం.

ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నిందితుడు మూర్తితోపాటు ఓ న్యాయవాది నుంచి సేకరించిన వాంగ్మూలాల ఆధారంగా విచారణ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. అయితే, రవి ప్రకాశ్ మాత్రం దర్యాప్తును దారిమళ్లించే ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. నిజానికి మూడో రోజు విచారణకు హాజరైన రవిప్రకాశ్‌ను పోలీసులు చాలాసేపు ఖాళీగా కూర్చోబెట్టారు. విడతల వారీగా ఆయనను విచారించిన అధికారులు ఆయన నుంచి సరైన సమాధానాలు రాబట్టడంలో విఫలమైనట్టు తెలుస్తోంది.

Ravi prakash
TV9
Hyderabad
Cyber crime
  • Loading...

More Telugu News