Andhra Pradesh: ఫిలింఛాంబర్ లో రామానాయుడి విగ్రహం ఏర్పాటు!

  • నేడు రామానాయుడు జయంతి
  • విగ్రహాన్ని ఆవిష్కరించిన నిర్మాత సురేష్ బాబు
  • కార్యక్రమానికి హాజరైన రాఘవేంద్ర రావు, అల్లు అరవింద్, పరుచూరి

మూవీ మొఘల్ రామానాయుడు జయంతిని పురస్కరించుకుని ఈరోజు హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ విగ్రహాన్ని ప్రముఖ నిర్మాత, రామానాయుడు కుమారుడు సురేష్ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దిగ్గజ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్, జి.ఆదిశేషగిరి రావు, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
సినీరంగానికి రామానాయుడు అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకు 2010లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. 2015, ఫిబ్రవరి 18న కేన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ రామానాయుడు తుదిశ్వాస విడిచారు. వందకు పైగా చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆయన చోటు సంపాదించారు.

Andhra Pradesh
Telangana
Hyderabad
Tollywood
ramanaidu
filnm chamber
statue
  • Loading...

More Telugu News