Andhra Pradesh: ఫ్రెండ్లీ పోలీసింగ్ లో కొత్త అడుగు.. ‘ప్రజల కోసం ప్రకాశం ఎస్పీ’ కార్యక్రమం షురూ!

  • శ్రీకారం చుట్టిన ఎస్పీ కౌల్
  • స్వయంగా ప్రజల నుంచి సమస్యల స్వీకరణ
  • పరిష్కరించాలని స్థానిక పోలీసులకు ఆదేశం

కొందరు పోలీస్ అధికారుల దురుసు ప్రవర్తన కారణంగా మొత్తం పోలీస్ వ్యవస్థపైనే ప్రజలకు తప్పుడు అభిప్రాయం ఏర్పడుతోంది. తాజాగా అలాంటి దురభిప్రాయాన్ని తొలగించేందుకు ప్రకాశం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ) సిద్ధార్థ్ కౌల్ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ‘ప్రజల కోసం ప్రకాశం ఎస్పీ’ పేరుతో కొత్త కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు.  

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలను స్వయంగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలను సత్వరం పరిష్కరించాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. శాంతి భద్రతలతో పాటు స్థానికంగా ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కు తాము కట్టుబడి ఉన్నామని సిద్ధార్థ్ కౌల్ చెప్పారు.

Andhra Pradesh
Police
Prakasam District
prajala kosam prakasam sp
  • Loading...

More Telugu News