Andhra Pradesh: ద్వారకా తిరుమలలో ప్రమాదం.. తప్పించుకున్న భక్తులు!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-e5a2d769562374abb7a9e94d05d4b06f582f723a.jpg)
- ఆలయ ప్రాంగణంలో పేలిన బాయిలర్
- సమీపంలో ఎవ్వరూ లేకపోవడంతో తప్పిన ముప్పు
- ఊపిరి పీల్చుకున్న ఆలయ అధికారులు
పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో ఈరోజు ప్రమాదం సంభవించింది. ఆలయంలో అన్నదానం, ఇతర సేవల కోసం వాడుతున్న బాయిలర్ అనుకోకుండా ఒక్కసారిగా పేలిపోయింది. ఈ సందర్భంగా భారీ శబ్దం రావడంతో భక్తులు, స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. అయితే ప్రమాద సమయంలో బాయిలర్ సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. దీంతో ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.