Cricket: మొదట బుమ్రా, ఆ తర్వాత స్పిన్నర్లు... 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా
- ఓపెనర్లను పడగొట్టిన బుమ్రా
- మిడిలార్డర్ పనిబట్టిన చాహల్, యాదవ్
- సౌతాంప్టన్ లో వరల్డ్ కప్ మ్యాచ్
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య సౌతాంప్టన్ లో మ్యాచ్ షురూ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న దక్షిణాఫ్రికా ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోగా, మిడిలార్డర్ సైతం తడబాటుకు గురైంది. వరల్డ్ టాప్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ధాటికి ఆమ్లా, డికాక్ వెనుదిరగ్గా, ఆపై టీమిండియా స్పిన్నర్లు తమ సత్తా చాటారు.
కెప్టెన్ డుప్లెసిస్ (38), డుసెన్ (22)లను లెగ్ స్పిన్నర్ చాహల్ అవుట్ చేయగా, ప్రమాదకర డుమినీ వికెట్ ను కుల్దీప్ యాదవ్ చేజిక్కించుకున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 26 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్, ఫెలుక్వాయో క్రీజులో ఉన్నారు.