Andhra Pradesh: సీఎం గారూ.. అగ్రిగోల్డ్ అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించండి!: బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ

  • పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి
  • విజయవాడలో కూల్చిన ఆలయాలు తిరిగి కట్టాలి
  • సీఎంకు 7 లేఖలు రాసిన ఏపీ బీజేపీ చీఫ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏడు బహిరంగ లేఖలు రాశారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులుగా మారిన ప్రజలకు న్యాయం చేయాలని కన్నా లేఖలో ముఖ్యమంత్రిని కోరారు. అలాగే రాష్ట్రంలో చుక్కల భూముల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

అగ్రిగోల్డ్ కుంభకోణం వ్యవహారంలో చోటుచేసుకున్న అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే ఏపీ దేవాదాయ పరిరక్షణ చట్టంలో మార్పులు తీసుకురావాలని ఆయన ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. విజయవాడలో ఇష్టానుసారం కూలగొట్టిన ఆలయాలను తిరిగి నిర్మించాలన్నారు.

Andhra Pradesh
Jagan
Chief Minister
kanna
BJP
7 letters
  • Loading...

More Telugu News