Payyavula Keshav: ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన టీడీపీ నేత పయ్యావుల

  • 2015లో ఎమ్మెల్సీగా ఎన్నికైన పయ్యావుల
  • 2021తో ముగియనున్న పదవీ కాలం
  • ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీకి రాజీనామా

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఉరవకొండ నుంచి విజయం సాధించిన టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. 2015లో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పయ్యావుల పదవీ కాలం 2021లో ముగియనుంది. అయితే, ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా సమర్పించారు. ఇప్పటి వరకు ఆయన శాసనమండలి చీఫ్‌గానూ వ్యవహరించారు. పయ్యావుల రాజీనామాను శాసనమండలి ఆమోదించింది. దీంతో ఇకపై ఆయన ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు.

Payyavula Keshav
Telugudesam
MLA
MLC
Andhra Pradesh
  • Loading...

More Telugu News