Balamani: ఒక్క ఓటు తేడాతో విజయం కాంగ్రెస్ ఖాతాలోకి!

  • ఎంపీటీసీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రోజా
  • టీఆర్ఎస్ తరుపున బాలమణి పోటీ
  • రోజాకు 611, బాలమణికి 610 ఓట్లు 
  • రీకౌంటింగ్‌లోనూ ఫలితం పునరావృతం

ఒక్కోసారి జయాపజయాలను నిర్ణయించేది ఒక్క ఓటే అవుతుంటుంది. అదే విధంగా ఒక్క ఓటు తేడాతో తెలంగాణ పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. మహబూబాబాద్ మండలంలోని శీత్లా తండాలో కాంగ్రెస్ తరుపున ఎంపీటీసీ అభ్యర్థిగా వాంకుడోతు రోజా పోటీ చేయగా, టీఆర్ఎస్ తరుపున లావొడియా బాలమణి పోటీ చేశారు.

నేడు ఓట్ల లెక్కింపులో భాగంగా రోజాకు 611 ఓట్లు రాగా, బాలమణికి 610 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో గెలుపొందినట్టు తేలడంతో టీఆర్ఎస్ అభ్యర్థి రీకౌంటింగ్ కోసం పట్టుబట్టారు. రీకౌంటింగ్‌లోనూ ఫలితంలో తేడా లేకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి రోజా విజయం సాధించినట్టు అధికారులు ప్రకటించారు.

Balamani
Roja
MPTC
Mahaboobabad
Congress
BJP
Telangana
  • Loading...

More Telugu News