ajit dhoval: కేంద్ర భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కు కేబినెట్ ర్యాంక్
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-89119746e78d4c9ce7454410d015d1f730be9659.jpg)
- ఎన్ఎస్ఏగా కాలపరిమితి మరో ఐదేళ్లపాటు పెంపు
- సేవలకు గుర్తింపుగా కేబినెట్ ర్యాంక్
- 1968 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ధోవల్
కేంద్ర భద్రతా సలహాదారుడు అజిత్ ధోవల్ కు కేంద్ర కేబినెట్ ర్యాంక్ స్టేటస్ ను కల్పించారు. అంతేకాదు జాతీయ భద్రతా సలహాదారుడిగా ఆయన కాల పరిమితిని మరో ఐదేళ్లపాటు పొడిగించారు. దేశ భద్రతకు సంబంధించి ఆయన చేసిన విశేషమైన సేవలకు గుర్తింపుగానే ధోవల్ కు కేబినెట్ ర్యాంక్ కల్పించారని మీడియా సంస్థ ఏఎన్ఐ తెలిపింది. 1968 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన అజిత్ ధోవల్... గతంలో ఐబీ చీఫ్ గా కూడా వ్యవహరించారు. దేశంలోని అత్యంత శక్తిమంతమైన అధికారుల్లో ఆయన ఒకరు.