adivi sesh: ఉత్కంఠభరితులను చేసే కథాకథనాలతో 'ఎవరు?'

  • అడివి శేష్ నుంచి మరో సస్పెన్స్ థ్రిల్లర్ 
  • రహస్యంగా జరుగుతోన్న షూటింగ్ 
  • ఆగస్టు 23వ తేదీన విడుదల  

మొదటి నుంచి కూడా అడివి శేష్ వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నారు. అందుకు నిదర్శనంగా 'క్షణం' .. 'గూఢచారి' సినిమాలు కనిపిస్తాయి. ఆయన తాజా చిత్రంగా సెట్స్ పై ఒక సస్పెన్స్ థ్రిల్లర్ వుంది. రెజీనా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి 'ఎవరు?' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు.

వెంకట్ రామ్జీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి అబ్బూరి రవి సంభాషణలను సమకూర్చారు. ఆగస్టు 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు అడివి శేష్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈ సినిమాపై ఆసక్తిని పెంచాలనే ఉద్దేశంతోనే మీడియాకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రహస్యంగా చిత్రీకరణను కానిచ్చేస్తున్నామని ఆయన అన్నాడు. మొత్తానికి అడివి శేష్ మరోసారి ఆడియన్స్ లో ఉత్కంఠను రేపే పనిలో వున్నాడన్న మాట. 

adivi sesh
regina
  • Loading...

More Telugu News