Falaknuma Das: హీటెక్కిన సోషల్ మీడియా వార్... విజయ్ దేవరకొండపై 'ఫలక్ నుమా దాస్' హీరో విశ్వక్ ఆగ్రహం!

  • ఇటీవల విడుదలైన 'ఫలక్ నుమా దాస్'
  • సినిమా బాగాలేదంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కామెంట్లు
  • మండిపడుతున్న విశ్వక్

ఇటీవల విడుదలైన 'ఫలక్ నుమా దాస్' చిత్రంపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చేస్తున్న సోషల్ మీడియా వార్ తారస్థాయికి చేరడంతో చిత్రం హీరో విశ్వక్ మండిపడుతున్నాడు. ఈ చిత్రం పరమ చెత్తగా ఉందని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో విరుచుకుపడుతున్నారు. సినిమాలో విశ్వక్ కొన్ని సీన్లలో విజయ్ ని అనుకరించినట్టు ఉండటమే వారి ఆగ్రహానికి కారణమైంది.

ఇక తన సినిమాకు అడ్డంకులు సృష్టించాలని చూస్తే, చూస్తూ ఊరుకునేది లేదని, తన అభిమానుల కామెంట్ల వెనుక విజయ్ దేవరకొండ ఉన్నాడని విశ్వక్ ఆరోపిస్తున్నారు. తన అభిమానులను విజయ్ కంట్రోల్ చేయాలని డిమాండ్ చేశాడు. తాను హైదరాబాద్ కు రానున్నానని, వచ్చిన వెంటనే మీడియా సమావేశం పెట్టి, అందరికీ సమాధానం ఇస్తానని చెబుతూ విశ్వక్, ఓ వీడియోను తీసి సోషల్ మీడియాలో విడుదల చేశాడు. తాను హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించి, సక్సెస్ మీట్ ను పెట్టనున్నానని స్పష్టం చేశాడు.

Falaknuma Das
Vishvak
Vijay Devarakonda
Fans
  • Loading...

More Telugu News