Anantapur District: టీడీపీ కార్యకర్తలపై దాడి... వైసీపీ పనేనన్న జేసీ ప్రభాకర్ రెడ్డి!

  • అనంతపురం జిల్లా యాడికి సమీపంలో ఘటన
  • ముగ్గురికి తీవ్రగాయాలు
  • ఆసుపత్రిలో పరామర్శించిన జేసీ ప్రభాకర్ రెడ్డి

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారని, అకారణంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడికి దిగుతున్నారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అనంతపురం జిల్లా యాడికి మండల పరిధిలోని కొనుప్పాలపాడు గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై దాడి జరుగగా, ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని ఆసుపత్రిలో పరామర్శించిన జేసీ, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని డాక్టర్లకు సూచించారు. దాడికి దిగింది వైసీపీ వర్గీయులేనని ఆరోపించిన జేసీ, తక్షణం వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Anantapur District
Yadiki
JC Prabhakar Reddy
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News