Cricket: సఫారీలపై గర్జించిన బంగ్లా పులులు... 50 ఓవర్లలో పరుగుల వర్షం!
- బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 330
- రాణించిన బ్యాట్స్ మెన్
- షకీబ్, ముష్ఫికర్, మహ్మదుల్లా విజృంభణ
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఇవాళ పరుగుల వాన కురిసింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ సౌమ్య సర్కార్ (42) నుంచి షకీబల్ హసన్ (75), ముష్ఫికర్ రహీం (78), చివర్లో మహ్మదుల్లా (46 నాటౌట్) వరకు అందరూ బాధ్యతగా ఆడడంతో బంగ్లాకు భారీస్కోరు సాధ్యమైంది. ఆ జట్టుకు ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. 35 ఓవర్ నుంచి 45 ఓవర్ వరకు పది ఓవర్లపాటు పరుగులు మందగించినా చివర్లో మహ్మదుల్లా బ్యాట్ ఝుళిపించడంతో బంగ్లా 300 మార్కు దాటడమే కాదు, సఫారీల ముందు కష్టసాధ్యమైన లక్ష్యాన్నుంచింది.