Ghosts: ఈ ఎన్నికల్లో దెయ్యాలు ఓటెయ్యలేదు: ఎన్నికల సంఘం

  • పోలైన ఓట్లకు.. అసలు ఓట్లకు పొంతన కరవు
  • 373 నియోజకవర్గాల్లో ఓట్ల తేడా
  • ప్రతిపక్షాల విమర్శలకు ఈసీ ధీటుగా సమాధానం

ఈవీఎంలో పోలైన ఓట్లకు, అసలు ఓట్లకు పొంతన కుదరడం లేదంటూ వస్తున్న విమర్శలపై ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. ఈ ఎన్నికల్లో అందరూ మనుషులే ఓటేశారని, దెయ్యాలు కాదని పేర్కొంది. గత నెల 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల కాగా, అప్పటి నుంచి విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.

ఎన్నికలు ముగిసిన తర్వాత ఈసీ వెల్లడించిన పోలింగ్ శాతానికి.. ఓట్ల లెక్కింపు రోజున వెల్లడించిన ఫలితాల శాతానికి మధ్య పొంతన కుదరడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తేడా వచ్చిన ఓట్లను ఘోస్ట్ ఓట్స్‌గా ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి. ఇటువంటి తేడా ఏకంగా 373 లోక్‌సభ నియోజకవర్గాల్లో కనిపించినట్టు జాతీయ మీడియా పేర్కొంది.

ఈ కథనాలపై ఈసీ స్పందించింది.  పోలింగ్ సమయంలో వెబ్‌సైట్‌లో పెట్టిన ఓటింగ్ శాతం తాత్కాలిక సమాచారమని, అది ఆ తర్వాత మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈవీఎంల లెక్కింపులో తేడా రావడమనేది చాలా సహజమైన విషయమని పేర్కొంది. త్వరలోనే పోలైన ఓట్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. కాబట్టి లెక్కలో తేడా వచ్చిన ఓట్లను ఘోస్ట్ ఓట్లని, వారిని ఘోస్ట్ ఓటర్లని పేర్కొనడం వారిని అవమానించడమే అవుతుందని ఈసీ పేర్కొంది.

Ghosts
Lok Sabha polls
EC
  • Loading...

More Telugu News