Kambhampati Rammohan Rao: ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి కంభంపాటి రామ్మోహన్‌రావు రాజీనామా

  • టీడీపీ అధికారాన్ని కోల్పోవడంతో రాజీనామాలు
  • ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాఘవేంద్రరావు రాజీనామా
  • చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన కంభంపాటి

ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడం, వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పలు నామినేటెడ్ పదవుల్లో ఉన్న వ్యక్తులు రాజీనామా బాట పట్టారు. ఇప్పటికే ఎస్వీబీసీ చైర్మన్ పదవికి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు రాజీనామా చేయగా, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవికి వేమూరి ఆనంద సూర్య, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవికి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ రాజీనామా చేశారు. నేడు ఢిల్లీ ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి కంభంపాటి రామ్మోహన్‌రావు రాజీనామా చేశారు. తనను ప్రత్యేక ప్రతినిధిగా నియమించిన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Kambhampati Rammohan Rao
Raghavendra Rao
Jaleel Khan
Vemuri Anand Surya
Telugudesam
Chandrababu
  • Loading...

More Telugu News