BJP: ఎన్నార్సీ ప్రక్రియ ఒవైసీ నియోజకవర్గం నుంచే మొదలుపెట్టాలి: అమిత్ షాకు విజ్ఞప్తి చేసిన రాజాసింగ్

  • కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు రాజాసింగ్ మద్దతు
  • కిషన్ రెడ్డితో ఏకీభవిస్తున్నానంటూ ట్వీట్
  • చర్చనీయాంశంగా మారిన కిషన్ రెడ్డి వ్యాఖ్యలు

హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కొత్తగా పదవీబాధ్యతలు చేపట్టిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. హైదరాబాద్ ఉగ్రవాదులకు సురక్షిత ప్రాంతం అని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీలేదని, ఆయన ఉగ్రవాదులపై చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు.

తాను ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నానని, జాతీయ పౌరుల నమోదు కార్యక్రమం (ఎన్నార్సీ) ఒవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గం నుంచే మొదలుపెట్టాలని కోరుతున్నామని తెలిపారు. అక్కడ ఎవర్నీ అరెస్ట్ చేయడానికి వీల్లేదన్నట్టుగా మాట్లాడుతున్నారని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ పాతబస్తీ మినీ పాకిస్థాన్ లా తయారైందని, అక్కడ ఎంతోమంది పాకిస్థానీలు, బంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తున్నారని రాజాసింగ్ గతంలోనూ ఆరోపించారు. అలాంటివాళ్లందరినీ ఏరిపారేయాలంటే ఎన్నార్సీ ప్రక్రియ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News