paruchuri: ఫ్యాక్షన్ సినిమాలతోను సందేశమే ఇచ్చాము: పరుచూరి గోపాలకృష్ణ
- ఫ్యాక్షన్ కథలు రాశాము
- ఫ్యాక్షన్ ను హైలైట్ చేయలేదు
- ఫ్యాక్షనిస్టులు గొప్పవాళ్లని చెప్పలేదు
'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, తాము చేసిన ఫ్యాక్షన్ సినిమాలను గురించి చెప్పుకొచ్చారు. 'ప్రేమించుకుందాం రా' .. 'సమరసింహారెడ్డి' .. 'నరసింహ నాయుడు' వంటి ఫ్యాక్షన్ సినిమాలకి మేము పనిచేశాము. కానీ ఏ సినిమాలోను మేము ఫ్యాక్షన్ ను హైలైట్ చేయలేదు .. ఫ్యాక్షనిస్ట్ గొప్పవాడు అని చెప్పలేదు.
ఫ్యాక్షనిజం తప్పు అనే విషయాన్ని స్పష్టం చేస్తూ క్లైమాక్స్ ను డిజైన్ చేసేవాళ్లము. ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ఉండకూడదని మా అన్నయ్య, నేను నిర్ణయించుకుని అలా చేసేవాళ్లం. 'ఇంద్ర' సినిమా విషయంలోను అదే పద్ధతిని పాటించాము. 'నరుక్కుంటూ పోతే అడివన్నది మిగలదు .. చంపుకుంటూపోతే మనిషన్నవాడు మిగలడు' అంటూ ఒకే ఒక్క డైలాగ్ తో ఫ్యాక్షనిజం కరెక్ట్ కాదనే చెప్పాము" అని అన్నారు.