YSR Statue: విజయవాడ పోలీస్‌ కంట్రోల్‌ రూం వద్ద వైఎస్సార్‌ విగ్రహం తిరిగి ఏర్పాటు చేయాలి: కాపునాడు నేత అంజిబాబు

  • కృష్ణాపుష్కరాల సమయంలో తొలగించిన విగ్రహం
  • ట్రాఫిక్‌కు అడ్డంకిగా ఉందని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయం
  • ఫైర్ స్టేషన్ లో ఉన్న విగ్రహం

విజయవాడ పట్టణంలోని పోలీస్‌ కంట్రోల్‌ రూం వద్ద దివంగత వైఎస్సార్‌ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని కాపునాడు జిల్లా అధ్యక్షుడు, వైసీపీ నేత యర్రంశెట్టి అంజిబాబు డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ మరణం తర్వాత అప్పటి కాంగ్రెస్‌ నాయకుడు గడపాటి రాజగోపాల్‌ నేతృత్వంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే కృష్ణా పుష్కరాల సమయంలో ట్రాఫిక్‌కి అడ్డంకిగా ఉందని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ విగ్రహాన్ని తొలగించి కంట్రోల్‌ రూం సమీపంలోని ఫైర్‌ స్టేషన్‌ వద్ద ఉంచింది. ఈ విగ్రహాన్ని ఎక్కడ నుంచి తొలగించారో తిరిగి అక్కడే ఏర్పాటు చేయాలని రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని అంజిబాబు కోరారు. ఇందుకోసం త్వరలో సీఎంను కలిసి వినతిపత్రం అందించనున్నట్లు తెలిపారు.

YSR Statue
Vijayawada
police control room
kapunadu
anjibabu
  • Loading...

More Telugu News