Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • దీక్ష చేబట్టిన కాజల్ అగర్వాల్
  • పవన్ ని అడిగానంటున్న బండ్ల! 
  • తెలుగులోకి హాలీవుడ్ సినిమా  

*  కథానాయిక కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఓ దీక్ష చేబట్టింది. అదేమిటంటే, వంద రోజుల్లో ఫిట్ గా మారిపోవాలన్నది. 'నా బాడీని ఫిట్ గా వుంచుకోవాలనుకుంటున్నాను. అందులో భాగంగా వంద రోజుల గడువు పెట్టుకున్నాను. నా ట్రైనర్ పర్యవేక్షణలో ఈ వర్కౌట్స్ మొదలుపెట్టాను. చూద్దాం.. మరో వంద రోజుల్లో నా బాడీ ఎలా తయారవుతుందో' అని చెప్పింది కాజల్.  
*  తన సినిమా ఆఫర్ ను పవన్ కల్యాణ్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారని ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ పేర్కొన్నారు. ఇటీవల పవన్ ను కలసి సినిమా చేయమని అడిగానని, అయితే ఇక సినిమాలు చేసే ఉద్దేశమే లేదని చెప్పారని ఆయన తెలిపారు. అయినప్పటికీ పవన్ తో సినిమా కోసం తాను ప్రయత్నిస్తూనే ఉంటానని గణేశ్ చెప్పారు.
*  పాతికేళ్ల క్రితం వచ్చిన హాలీవుడ్ ఏనిమేషన్ చిత్రం 'లైన్ కింగ్' ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రూపొందింది. దీనిని తెలుగులోకి కూడా అనువదిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి వాల్ట్ డిస్నీ సంస్థ సన్నాహాలు చేస్తోంది.

Kajal Agarwal
Pawan Kalyan
Ganesh
Lion King
  • Error fetching data: Network response was not ok

More Telugu News