Godavari: గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానాన్ని నిలిపి వేయాలని ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశాలు

  • ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసిన వట్టి వసంత కుమార్
  • అనుమతుల్లేకుండా పనులు ప్రారంభించడానికి వ్యతిరేకం
  • విచారణ చేపట్టిన జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్

గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం పనులను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వానికి జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ నేత వట్టి వసంతకుమార్ దీనిపై పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా పనులు ప్రారంభించడాన్ని వసంతకుమార్ వ్యతిరేకించారు. ఆయన పిటిషన్‌ను విచారణకు చేపట్టిన జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ గోదావరి-కృష్ణా-పెన్నా ప్రాజెక్టుల పనులను అన్ని అనుమతులు వచ్చే వరకూ చేపట్టరాదని ఆదేశాలు జారీ చేసింది.

Godavari
Penna
Krishna
Andhra Pradesh
Vatti Vasantha kumar
  • Loading...

More Telugu News