Jagan: వైఎస్ జగన్ ఇంటికి వచ్చిన డీజీపీ గౌతమ్ సవాంగ్!

  • ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్
  • నిన్న ఉత్తర్వులు జారీ
  • ఈ ఉదయం జగన్ తో భేటీ

ఆంధ్రప్రదేశ్ సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే పాలనపై తనదైన ముద్రవేస్తూ, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వైఎస్ జగన్ మార్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీ డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ ను మారుస్తూ, గౌతమ్ సవాంగ్ ను జగన్ ఎంచుకున్నారు. ఈ మేరకు ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ, నిన్న ఉత్తర్వులు జారీ కాగా, ఈ ఉదయం సవాంగ్, తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటికి వచ్చి, ఆయనతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై వీరిద్దరి మధ్యా కాసేపు చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. మరికాసేపట్లో జగన్, సచివాలయానికి వెళ్లనున్నారు.

Jagan
Andhra Pradesh
DGP
Gautam Sawand
  • Loading...

More Telugu News