Srireddy: తమిళ బిగ్ బాస్ 3వ సీజన్ లో శ్రీరెడ్డి!

  • కాస్టింగ్ కౌచ్ పై గళమెత్తి వార్తల్లోకి
  • ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న శ్రీరెడ్డి
  • ఇంకా వెలువడని అధికారిక ప్రకటన

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై గళమెత్తి, నడిరోడ్డుపై అర్థనగ్న ప్రదర్శన చేసి వార్తల్లోకి ఎక్కన శ్రీరెడ్డి, తమిళ బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా ఉండనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కమల్ హాసన్ వ్యాఖ్యాతగా, ఇప్పటికే రెండు సీజన్లు పూర్తికాగా, మూడో సీజన్ ప్రోమో విడుదలై, ఇప్పుడు తమిళ బుల్లితెర ప్రేక్షకులను ఊపేస్తోంది. ఇక ఈ షోలో శ్రీరెడ్డి పాల్గొంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్ లో దీక్ష తరువాత చెన్నైకి మకాం మార్చి ప్రస్తుతం అక్కడే ఉంటున్న శ్రీరెడ్డి, బిగ్ బాస్ లో పాల్గొనే విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

Srireddy
Tamil
Biggboss
Season 3
  • Loading...

More Telugu News