RGV: జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు అందుకుంటే ఎన్నికల్లో ఓటమిని అందరూ మర్చిపోతారు: వర్మ

  • టీడీపీని రక్షించగలిగేది తారక్ ఒక్కరే
  • తాతపై గౌరవం ఉంటే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ బాధ్యతలు అందుకోవాలి
  • వర్మ మరో వివాదాస్పద ట్వీట్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగుదేశం పార్టీపై తన అభిప్రాయాలు వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ స్వీకరిస్తే ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని అందరూ మర్చిపోతారని ట్వీట్ చేశారు. మునిగిపోతున్న టీడీపీని రక్షించగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది తారక్ ఒక్కరేనని వర్మ అభిప్రాయపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ కు తన తాతగారిపై ఏమైనా అభిమానం ఉంటే వెంటనే టీడీపీని రక్షించే బాధ్యతలను తన భుజాలపై వేసుకోవాలని సూచించారు.

If Tarak takes over TDP , all people will immidiately forget TDP’s disastrous failure..NTR’s grandson can be the only saviour and if he has any respect for his grandfather he should immoderately save TDP Jai NTR Jai TARAK

— Ram Gopal Varma (@RGVzoomin) 
May 30, 2019 ">

  • Loading...

More Telugu News