Jagan: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన జగన్

  • ఇవాళ పుణ్యక్షేత్రాల సందర్శనతో జగన్ బిజీ
  • ఇడుపులపాయ నుంచి విజయవాడ వచ్చిన కాబోయే సీఎం
  • మరికాసేపట్లో గవర్నర్ తో భేటీ

ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ పుణ్యక్షేత్రాల సందర్శనతో క్షణం తీరికలేకుండా ఉన్నారు. తాజాగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఇడుపులపాయ నుంచి విజయవాడ చేరుకున్న జగన్ ఈ సాయంత్రం దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు, జగన్ కు ఆలయవర్గాలు సంప్రదాయబద్ధంగా ఘనస్వాగతం పలికాయి. ఈవో కోటేశ్వరమ్మ, ఇతర ఆలయ అధికారులు, అర్చకులు జగన్ కు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

రేపు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన ఈ ఉదయం నుంచి వరుసగా తిరుమల, కడప సీఎస్ఐ చర్చి, అమీన్ పీర్ దర్గాలను సందర్శించారు. ఆపై ఇడుపులపాయలో తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. అక్కడ్నించి హెలికాప్టర్ లో కడప విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చారు.

దుర్గామాత దర్శనం తర్వాత జగన్ విజయవాడ గేట్ వే హోటల్ లో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. రేపటి ప్రమాణస్వీకారం గురించి ఆయనతో చర్చిస్తారు.

  • Loading...

More Telugu News