Pakistan: పాకిస్థాన్‌ సరిహద్దులో ఇద్దరి అరెస్టు... ఆ దేశ గూఢచారులుగా అనుమానం

  • అనుమానాస్పద కదలికలను పసిగట్టిన సైనికులు
  • సమీపంలోని ఆర్మీక్యాంపు, పరిసరాల చిత్రీకరణ
  • కథువా, డొడా ప్రాంతాల వారని గుర్తింపు

సరిహద్దులో సంచరించడమేకాక సమీపంలోని ఆర్మీపోస్టు, పరిసర ప్రాంతాలను చిత్రీకరిస్తున్న ఇద్దరు వ్యక్తులను భారత్‌ సైనికాధికారులు అరెస్టు చేశారు. వీరు పాకిస్థాన్‌ తరపున గూఢచారులుగా వ్యవహరిస్తున్నారని అనుమానిస్తున్నారు. సరిహద్దులో గస్తీ కాస్తున్న సిబ్బంది వీరి అనుమానాస్పద కదలికలను పసిగట్టి అదుపులోకి తీసుకున్నారు. విచారించగా ఒకరు కథువా, మరొకరు డొడా ప్రాంతానికి చెందిన వారని గుర్తించారు. వెంటనే వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లోని వీడియోలు పరిశీలించగా అరెస్టుకు ముందు భారత్‌లోని పలు ప్రాంతాలను చిత్రీకరించి ఆ వీడియోను పాకిస్థాన్‌లో కొందరికి పంపినట్లు గుర్తించారు. అలాగే పాకిస్థాన్‌లోని వ్యక్తులతో వీరు తరచూ సంభాషిస్తున్నారని కూడా తేలిందని సైనికాధికారులు తెలిపారు.

Pakistan
border
two arrest
spy agents
  • Loading...

More Telugu News