DATA THEFT: డేటా చోరీ కేసు.. హైకోర్టును మరోసారి ఆశ్రయించిన ఐటీ గ్రిడ్స్ అశోక్!

  • ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు
  • పాత పిటిషన్ ను కొట్టివేసిన రంగారెడ్డి కోర్టు
  • నేడు అశోక్ పిటిషన్ ను విచారించనున్న హైకోర్టు

డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్ మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. డేటాచోరీ వ్యవహారంలో అశోక్ పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అశోక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను రంగారెడ్డి కోర్టు కొట్టివేసింది. దీంతో అశోక్, ఆయన భార్య శ్రీలక్ష్మి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసులను కొట్టివేయాలని అశోక్ ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, అశోక్ దాఖలుచేసిన బెయిల్ పిటిషన్ ను నేడు హైకోర్టు విచారించనుంది. మరోవైపు పరారీలో ఉన్న అశోక్ కోసం తెలంగాణ పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. అశోక్ విజయవాడ, విశాఖపట్నం, ముంబై, బెంగళూరులో తలదాచుకుని ఉండొచ్చన్న అనుమానంతో ఆయా నగరాల్లో గాలిస్తున్నారు.

DATA THEFT
Andhra Pradesh
Telangana
CEO ASHOK
it grids
High Court
  • Loading...

More Telugu News