Paruchuri Gopalakrishna: విజయలక్ష్మి నన్ను నమ్మి నేటికి నలభై తొమ్మిదేళ్లు: పరుచూరి గోపాలకృష్ణ!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-48ae9a885807ba940fe70cda63d1913df8d88f31.jpg)
- గోపాలకృష్ణ వివాహమై 49 సంవత్సరాలు
- తన జీవితంలోని ప్రతి మార్పుకూ భార్యే కారణం
- ఆమె అంగీకరిస్తేనే అన్నీ జరిగాయన్న పరుచూరి
టాలీవుడ్ రచయిత, ప్రముఖ నటుడు పరుచూరి గోపాలకృష్ణకు వివాహమై నేటికి 49 సంవత్సరాలు కాగా, తన భార్యను అభినందిస్తూ, ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పంచుకున్నారు. "విజయలక్ష్మి నన్ను నమ్మి నాతో కలసి ఏడడుగులు నడిచి నేటికి నలభై తొమ్మిదేళ్లు నిండి, యాభయ్యవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. నా జీవితంలో సంభవించిన ప్రతి మార్పు తనతో చర్చించి , తాను అంగీకరించాకే జరిగింది. కుటుంబ సభ్యులు, మీ అందరి ఆశీర్వాద బలంతో ముందడుగు వెయ్యాలని కోరుకుంటున్నాం" అని ఆయన ట్వీట్ పెట్టారు. ఇప్పుడా ట్వీట్ వైరల్ అవుతోంది.
విజయలక్ష్మి నన్ను నమ్మి నాతో కలసి ఏడడుగులు నడిచి నేటికీ నలభై తొమ్మిదేళ్లు నిండి , యాభయ్యవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. నా జీవితంలో సంభవించిన ప్రతి మార్పు తనతో చర్చించి , తాను అంగీకరించాకే జరిగింది. కుటుంబ సభ్యులు, మీ అందరి ఆశీర్వాద బలంతో ముందడుగు వెయ్యాలని కోరుకుంటున్నాం pic.twitter.com/wDl11n4Hxv
— Paruchuri GK (@GkParuchuri) May 29, 2019