Fire Accident: కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం...రూ.కోటి ఆస్తి నష్టం

  • తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో ఘటన
  • మార్కెట్‌ యార్డు పక్కనే ఉన్న పరిశ్రమ
  • మంటల్ని అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది

తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని మార్కెట్‌ యార్డును ఆనుకుని ఉన్న కొబ్బరిపీచు పరిశ్రమలో పీచు కుప్పలకు నిప్పంటుకుని దాదాపు కోటి రూపాయల మేర ఆస్తి నష్టం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఎగసి పడుతున్న అగ్నిజ్వాలలను తీవ్రంగా శ్రమించి అదుపులోకి తెచ్చారు. మార్కెట్‌ యార్డు పక్కన ప్రమాదం జరగడంతో స్థానికంగా తీవ్రభయాందోళనలు నెలకొన్నాయి. అయితే మంటలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

Fire Accident
East Godavari District
ambajipeta
coconut husk
  • Loading...

More Telugu News