Jagan: జగన్‌కు పద్మావతి అతిథి గృహం వద్ద ఘన స్వాగతం

  • జగన్‌ను కలిసిన రమణ దీక్షితులు
  • నేడు పద్మావతి అతిథి గృహంలోనే బస
  • రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న జగన్

వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్‌ తిరుమల చేరుకున్నారు. ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు పుష్ప గుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం జగన్‌ను శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు కలిశారు. ఈ రాత్రికి పద్మావతి అతిథి గృహంలోనే బస చేసి రేపు ఉదయం 8.15 నిమిషాలకు కుటుంబ సభ్యులతో కలిసి జగన్ శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శనానంతరం జగన్ నేరుగా కడప పర్యటనకు వెళ్లనున్నారు.

Jagan
Padmavathi Guest House
Anil Singhal
Srinivasa Raju
Kadapa
  • Loading...

More Telugu News