Telugudesam: అబద్ధాల ‘సాక్షి’ ఇంకా తన బుద్ధి మార్చుకోలేదు: నారా లోకేశ్ ఫైర్

  • మా కార్యకర్తలపై నేను అనుచిత వ్యాఖ్యలు చేశానట!
  • సాక్షి ఛానెల్ లో విషప్రచారం చేస్తున్నారు
  • దీనికి ఆధారాలు చూపించాలని ఛాలెంజ్ చేస్తున్నా

ఏపీలో టీడీపీ ఓటమికి ఆ పార్టీ కార్యకర్తలు, నేతలే బాధ్యులని తాను వ్యాఖ్యలు చేశానంటూ వస్తున్న వార్తలను నారా లోకేశ్ ఖండించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై తాను అనుచిత వ్యాఖ్యలు చేశానని సాక్షి ఛానెల్ లో చేస్తున్న విషప్రచారానికి ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. ఇకనైనా, తమ వైఖరి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని లోకేశ్ హెచ్చరించారు. అబద్ధాల సాక్షి ఇంకా తన బుద్ధి మార్చుకోలేదని, సాక్షి ఛానెల్ యాజమాన్యానికి హుందాతనం, మీడియా విలువలు లేవనడానికి ఆ ఛానెల్ తనపై ఇస్తున్న బ్రేకింగ్ న్యూసే నిదర్శనమని దుమ్మెత్తిపోశారు. 

Telugudesam
Nara Lokesh
YSRCP
jagan
sakshi
  • Loading...

More Telugu News