: మంత్రి ఆనం కొత్తపల్లవి
వైఎస్ జగన్ ను ఉరితీయాలంటూ గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్ కుటుంబంపై బురద జల్లడం మానుకోవాలంటూ కొత్త పల్లవి అందుకున్నారు. విజయవాడలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆనం వైఎస్ హయంలో రైతులకు ఇవ్వాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ 500 కోట్ల రూపాయిల బకాయిలు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. వైఎస్ చెప్పినట్టే జీవోలపై మంత్రులు సంతకాలు చేసారని కళంకిత మంత్రులను వెనకేసుకొచ్చిన ఆయన, ఇకపై వైఎస్ కుటుంబంపై, కాంగ్రెస్ పై బురదచల్లడం మానుకోవాలని హితవుపలికారు.