harish kalyan: 'మూగమనసులు' టైటిల్ తో మరో ప్రేమకథ

  • 'జెర్సీ'తో గుర్తింపు తెచ్చుకున్న హరీశ్ కల్యాణ్
  • దర్శకురాలిగా సౌజన్య పరిచయం
  • త్వరలోనే సెట్స్ పైకి

తెలుగులో ఇంతవరకూ వచ్చిన ఆణిముత్యాల్లాంటి చిత్రాల జాబితాలో 'మూగమనసులు' ముందువరుసలో కనిపిస్తుంది. ఇప్పుడు అదే టైటిల్ తో మరో ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సౌజన్య దర్శకత్వంలో ఒక ప్రేమకథ పట్టాలెక్కనుంది. ఈ సినిమా ద్వారానే సౌజన్య దర్శకురాలిగా పరిచయం కానున్నారు. తాజాగా ఈ సినిమాకి 'మూగమనసులు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. 'జెర్సీ' ద్వారా పరిచయమైన హరీశ్ కల్యాణ్ ను హీరోగా ఎంపిక చేసుకున్నారు. కథానాయిక ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

harish kalyan
  • Loading...

More Telugu News