EVV Satyanarayana: ఈవీవీ ఇంట విషాదం... అల్లరి నరేశ్ నాయనమ్మ కన్నుమూత!

  • ఈవీవీ మరణించినప్పటి నుంచి స్వగ్రామంలోనే వెంకటరత్నమ్మ
  • కోరుమామిడి గ్రామంలో మృతి
  • అంత్యక్రియల్లో పాల్గొన్న రాజేశ్, నరేశ్

దివంగత సినీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తల్లి ఈదర వెంకటరత్నమ్మ నిడదవోలు మండలం కోరుమామిడిలో కన్నుమూశారు. ఆమె వయసు 87 సంవత్సరాలు. కుమారుడు మరణించినప్పటి నుంచి కోరుమామిడిలోనే నివసిస్తున్న ఆమె, వృద్ధాప్య కారణాలతో మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

తమ నాయనమ్మ మృతి వార్త తెలుసుకుని హుటాహుటిన గ్రామానికి వచ్చిన అల్లరి నరేశ్, ఆర్యన్ రాజేశ్, ఈవీవీ సోదరుడు సత్తిబాబు తదితరులు దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. కాగా, ఈదర వెంకట్రావు, వెంకటరత్నమ్మ దంపతులకు ఈవీవీ సత్యనారాయణతో పాటు గిరి, శ్రీనివాస్ లు కుమారులు కాగా, మంగ కుమార్తె. ఆమె మృతిపట్ల సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు, నరేశ్, రాజేశ్ లను ఓదార్చారు.

EVV Satyanarayana
Mother
Died
Allari Naresh
  • Loading...

More Telugu News