Ravi Prakash: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కోసం గుజరాత్, ముంబైలకు ప్రత్యేక టీమ్ లు!

  • రవిప్రకాశ్ పై ఫోర్జరీ, మోసం ఆరోపణలు 
  • ఎన్నికల ఫలితాల ముందు వరకు ఏపీలో వున్నట్టు పోలీసుల అనుమానం 
  • విచారణకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్న రవిప్రకాశ్ 

ఫోర్జరీ, మోసం తదితర తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ, దాదాపు మూడు వారాలుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్, ఏపీని విడిచి గుజరాత్, మహారాష్ట్ర లేదా కర్ణాటకకు వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే గుజరాత్, ముంబైలకు ప్రత్యేక టీమ్ లను పంపిన అధికారులు, బెంగళూరులోనూ రవిప్రకాశ్ కోసం గాలిస్తున్నారు.

రవిప్రకాశ్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, పలుమార్లు విచారణకు రావాలని నోటీసులు జారీ చేసినా ఆయన హాజరు కాలేదన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ముందస్తు బెయిల్ కోసం రెండుసార్లు హైకోర్టును ఆశ్రయించినా, ఆయనకు నిరాశే మిగిలింది. కాగా, ఎన్నికల ఫలితాల ముందు వరకూ ఏపీలో తలదాచుకున్న రవిప్రకాశ్, ఫలితాల వెల్లడి తరువాత ఏపీని వదిలి వెళ్లుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన సోషల్ మీడియా, వాట్స్ యాప్ ద్వారా తన మిత్రులు, న్యాయవాదులతో మాట్లాడుతున్నట్టు కూడా అనుమానిస్తున్నారు.

Ravi Prakash
TV9
Andhra Pradesh
Police
  • Loading...

More Telugu News