Jagan: జగన్, కేసీఆర్ ల విమానంలోనే గవర్నర్ కూడా!

  • 30న ఉదయం పూట జగన్ ప్రమాణం
  • అదే రోజు రాత్రి న్యూఢిల్లీలో మోదీ ప్రమాణ స్వీకారం
  • స్పెషల్ ఫ్లయిట్ లో ఇద్దరు సీఎంలు, గవర్నర్ వెళ్లే అవకాశం

ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్, జగన్ లు ఒకే విమానంలో వెళ్లనున్నారన్న వార్తలు వస్తుండగా, అదే విమానంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా ఉంటారని తెలుస్తోంది. 30వ తేదీన జగన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉండగా, దీనికి కేసీఆర్ రానున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ముగియగానే, మధ్యాహ్న భోజన అనంతరం రెండు రాష్ట్రాల సీఎంలు ఒకే విమానంలో గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారని తెలిసింది. ఇక ఇదే కార్యక్రమానికి నరసింహన్ కు కూడా ఆహ్వానం అందడంతో ముగ్గురూ కలిసి ఒకే విమానంలో ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.

Jagan
KCR
ESL Narasimhan
Oath
Narendra Modi
  • Loading...

More Telugu News