Kumara Swamy: నాపై పెట్టిన కేసులపై కోర్టులోనే తేల్చుకుంటా: ఎడిటర్ విశ్వేశ్వరభట్ ఫైర్
- 19 ఏళ్లుగా ఎడిటర్‌గా ఉన్నా
- ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదు
- మనం ఎక్కడున్నామో అర్థం కావట్లేదు
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్‌పై కథనాన్ని ప్రచురించిన ‘విశ్వవాణి’ పత్రిక ఎడిటర్ విశ్వేశ్వరభట్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. తనను అనవసరంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చి తన భవిష్యత్‌ను నాశనం చేశావంటూ, తన తాత దేవెగౌడతో సినీ నటుడు నిఖిల్ తాగిన మత్తులో గొడవ పడినట్టు ‘విశ్వవాణి’లో కథనం ప్రచురితమైంది.
దీంతో ‘విశ్వవాణి’ ఎడిటర్ విశ్వేశ్వరభట్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదైంది. దీనిపై కొద్ది సేపటి క్రితం విశ్వేశ్వర భట్ స్పందించారు. తాను 19 ఏళ్లుగా ఎడిటర్‌గా ఉన్నానని, తనకిలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదని, అసలు మనం ఎక్కడున్నామో అర్థం కావట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన కథనం కల్పితమని భావిస్తే పరువు నష్టం దావా వేసుకోవాలి కానీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడమేంటని ప్రశ్నించారు. తనపై పెట్టిన కేసులపై కోర్టులోనే తేల్చుకుంటామని విశ్వేశ్వరభట్ స్పష్టం చేశారు.