Uttar Pradesh: నా జీవితం తెరిచిన పుస్తకం..మీరే నా కుటుంబం: సోనియాగాంధీ

  • రాయ్ బరేలి నియోజకవర్గ ప్రజలకు సోనియా లేఖ
  • నా విజయానికి పాటుపడ్డ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
  • నాకు ఉన్న నిజమైన ఆస్తి ప్రజలే

ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఘన విజయం తెలిసిందే. ఈ సందర్భంగా తన విజయానికి పాటుబడ్డ పార్టీ కార్యకర్తలు, నాయకులు, నేతలకు, తనకు ఓటు వేసిన ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాయ్ బరేలి నియోజకవర్గ ప్రజలకు సోనియా ఓ లేఖ రాశారు. తన జీవితం తెరచిన పుస్తకం అని, ప్రజలే తన కుటుంబమని, తనకు ఉన్న నిజమైన ఆస్తి ప్రజలేనని పేర్కొన్నారు.

ప్రతి లోక్ సభ ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా తనపై నమ్మకం ఉంచి తనను ఎన్నుకున్నందుకు, తన విజయానికి పాటుపడ్డ ప్రతి కార్యకర్తకు, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, స్వాభిమాన్ దళ్ పార్టీ నాయకులు అందరికీ తన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. దేశ ప్రాథమిక విలువలను కాపాడతానని, కాంగ్రెస్ పార్టీ ముందుతరం నేతలు అనుసరించిన విధానాలను కొనసాగిస్తానని పేర్కొన్న సోనియా, ఈ క్రమంలో తన జీవితాన్ని త్యాగం చేసేందుకు ఏమాత్రం వెనుకాడనని ఆ లేఖలో పేర్కొన్నారు.

Uttar Pradesh
raibareli
Sonia Gandhi
congress
  • Loading...

More Telugu News