Tirumala: లోపాలను సరిదిద్దుకుంటాం.. మళ్లీ విజయం సాధిస్తాం: టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప

  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిన రాజప్ప
  • బాబు కష్టపడి పని చేసినా తీర్పు వ్యతిరేకంగా వచ్చింది
  • ఆ తీర్పును శిరసావహిస్తాం

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన నిమ్మకాయల చిన రాజప్ప ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఐదేళ్లపాటు తాను కష్టపడి పని చేయడానికి తోడుగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అండగా నిలిచాయని అందుకే విజయం సాధించానని చెప్పారు. చంద్రబాబునాయుడు కష్టపడి పని చేసినా ప్రజల తీర్పు వ్యతిరేకంగా వచ్చిందని, ఆ తీర్పును శిరసావహిస్తామని చెప్పారు. లోపాలు ఏం జరిగాయో తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటామని, పార్టీని ముందుకు తీసుకెళ్లి, మళ్లీ విజయం సాధించేందుకు పాటుపడతామని అన్నారు.

Tirumala
peddapuram
Telugudesam
mla
china rajappa
  • Loading...

More Telugu News